Saturday, May 30, 2020

వినిపించని రాగాలు.....

🌺🌷🌺🌷🌺🌷🌺🌷
                🌺🌹🌺🌹🌺🌷

ఉప్పొంగే ఊహల ఊసులు 
భాషకు అందని భావాలై 
అలలు అలలుగా సాగి 
వినిపించని రాగాలై 
కనిపించే అక్షరాలుగా మారి 
పరుగులు తీస్తూ 
నా హృదయపు తంత్రుల్ని మీటి 
పరవశింపజేస్తున్నాయే !
ఇది నిజమా? 
ఔను నిజమే అంటూ 
అదిగో ! మరో భావవీచిక !
నా గుండె తలుపు తట్టుతోంది 
మస్తిష్కంలో జొరబడి 
వినిపించని రాగాలేవో 
పలికిస్తోంది మరి  !!

🌺🌹🌺🌹🌺🌹🌷🌹🌷🌹🌷🌹🌺🌹
🌺🌹🌺🌹🌺🌹🌷🌹🌷🌹🌺🌹🌷🌹

3 comments:

  1. LRSR: నీకే వినిపించని ఆ రాగాలు మరెవరికి
    వినిపిస్తాయి. అవి ఎలా ఉంటాయి.

    ReplyDelete
  2. ఊహలెప్పుడూ కనిపించవు,మదిలో మెదుల్తాయి. అలా మెదిలే ఊహలే వినిపించని రాగాలు. అవి వినపడవు కానీ అక్షరాలుగా మారగలవు.

    ReplyDelete