Sunday, May 10, 2020

ఆరనీకుమా ఆశాదీపం

కలిమి పోయిందా ? 
కలవరపడకు 
కష్టపడితే కలిసొస్తుంది           🌹🌺🌷

బలిమి పోయిందా? 
బాధపడకు 
బ్రతుకుబండేమీ ఆగిపోదు       🌷🌺🌹

ఆరోగ్యం దిగజారిందా? 
దిగులు పడకు, బాగయ్యే 
మార్గాలున్నాయి, వెతుకు         💐🌺🌹

అయితే ---
ఆశ ఆవిరై పోయిందా ? 
నీవు జీవన్మృతుడవే సుమా !
ఆ దీపం ఆరిపోనీకు ఎప్పటికీ 
ఆశాజీవికి అపజయమెక్కడిది మిత్రమా !!
                                                🌄🌈💐🌹🌄*

2 comments:

  1. LRSR: ఆశాదీపం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

    కవిత బాగుంది.

    ReplyDelete