కరోనా వైరస్
మహమ్మారి
విలయతాండవం
కరాళ నృత్యం
మరణమృదంగం
లాక్ డౌన్
మహమ్మారి
విలయతాండవం
కరాళ నృత్యం
మరణమృదంగం
లాక్ డౌన్
రెండు నెలలుగా జనాలందరి నోళ్ళలో నానుతున్న పదాలివి అని గ్రహించిఉంటారు.ఇదంతా కరోనా వైరస్ గురించేనన్నది విదితమే. దాన్ని మించిన ఉత్పాతం నిన్న విశాఖ సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ అనే వాయువు లీకేజీ ఫలితంగా సంభవించిన విషాద ఘట్టం!
కరోనా వైరస్ మనిషిమీద దాడి చేసిన కొద్దిరోజుల తర్వాత గానీ దాని ప్రభావం, లక్షణాలూ కనిపించవు. కానీ ఈ విషవాయువు క్షణాల్లో మనిషిని మృత్యుముఖం లోకి నెట్టేసే అత్యంత ప్రమాదకరమైందని నిన్నటి బాధాకర దృశ్యాలు చూస్తే తెలిసింది. రోడ్డువార, కాలువల్లో, బావిలో పడి మృత్యువాత బడ్డ వారి దీనస్థితి వర్ణించడానికి మాటలు చాలవు.
ప్రభుత్వం వేగమే స్పందించి ఆయా కుటుంబాలకు కోటి పరిహారం అందిస్తామనడం హర్షణీయం. బాధితులకు సత్వరమే సహాయ చర్యలు చేపట్టడం, భరోసా ఇవ్వడం నిజంగా ఊరట కల్గించే విషయం.
-----కానీ, గత కొద్దిరోజులుగా సంభవిస్తున్న ఘటనలు చూస్తోంటే అసలు మనిషి ప్రాణాలకు ' గ్యారంటీ ' అన్నదుందా? అన్న సందేహం కల్గుతోంది. ఎందుకంటే నిన్నటిదాకా ఆరోగ్యంగా, ఉల్లాసంగా తిరిగిన వ్యక్తి ఈదినం హఠాత్తుగా అదృశ్యమైపోవడం !
+++++++++++++++++++++++++++++++++++++
మళ్ళీ కలుద్దాం
+++++++++++++++++++++++++++++++++++++
LRSR: అంతా విధి విలాసం. ఏంచేస్తాం.
ReplyDeleteYou are right
ReplyDeleteM D D