Saturday, June 27, 2020

తొలకరి 🌷

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

 తొలకరి జల్లు తొలిసారి రాలి
 తాకింది పుడమిని
 పూల పరిమళాల గుభాళింపులతో
 కలిసి ఎగసిన కమ్మటి మట్టి వాసన
 నవ్యతనంది పుచ్చుకుని
 నాట్యం చేస్తోంది చూడు!
 ఇంతలేసి కళ్ళు విప్పార్చి
 విహంగశ్రేణులు రెక్కలాడించి
 విహరిస్తూ చేస్తున్నాయి
 వింత వింత నాదాలేవో  !
 కొమ్మల రెమ్మలు అల్లనల్లన తాకుతూ
 మౌన భాషలో గుసగుసలు పోతున్నట్లు
 ఏమా సొగసు  !
 పండించే రైతన్నలు
 నిరీక్షణ పండిన తరుణాన 
 అదిగో !
 పైపైకి చూస్తూ తృప్తిగ నిట్టూర్చి
 పరవశిస్తూన్నారు  !
 నింగిని దాగిన మబ్బుల నీటి కుండలు
 ఒక్కసారిగా భళ్ళున విచ్చిపోయి
 అంతలోనే అయ్యాయి జడివానలు !
 నేలతల్లి దాహార్తిని తీరుస్తూ
 మండువేసవికి మంగళం పాడుతూ
 వాగులూ వంకలూ పొంగి పొర్లుతూ
 పరుగులుతీస్తూ పారుతున్నాయి
 చూడు చూడు !
 అవును మరి ! ఇవి ఋతురాగాలు !
 ప్రకృతి పాటించే
 క్రమం తప్పని నియమాలు !
 ఆస్వాదిస్తూ సిద్ధం కండీ
 పలుకుదాం ఘన స్వాగతాలు !!

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ముక్కమల్ల ధరిత్రీ దేవి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment