Wednesday, June 24, 2020

ఎంత పని చేసావే 'కరోనా' ! 🌷

ఎంత పని చేసావే ' కరోనా ' !
 సజావుగా సాగుతున్న
 రథచక్రాల్ని ఒక్కసారిగా
 గతుకుల బాటలోకి తోసేశావు !
 దిక్కుతోచక జనమంతా
 బిక్కుబిక్కుమంటూ
 బావురుమంటున్నారు !
 పిలవని చుట్టంలా వచ్చావు
 భూతలమంతా చుట్టేశావు 
 లక్షలాది ప్రాణాల్ని బలి పెట్టావు 
 ఆర్థిక వ్యవస్థను 
 అతలాకుతలం చేసేశావు 
 వాణిజ్య రంగం
 చిన్నబోయేలా కూల్చేశావు 
 విద్యారంగాన్ని' శూన్యం 'గా 
 మిగిల్చావు!
 యువత ఆశలు
 నిర్వీర్యం చేశావు
 మొత్తానికి ప్రపంచ భవిష్యత్తే 
 ప్రశ్నార్థకం చేశావు !
 నెలలు గడుస్తున్నా
 వీడనంటున్నావు !
 రెచ్చిపోతూ చోద్యం 
 చూస్తున్నావు
 ఇంకా తీరలేదా నీ ' దాహం ' ? 
 ఇంత చేసినా !
 ఎంత పని చేసావే' కరోనా '!
 పుచ్చుకోవమ్మా  సెలవు
 ఇకనైనా !!
************************************
 { రోజు రోజుకీ పెరిగి పోతున్న కరోనా కేసులు చూస్తూ... }
*****************************

No comments:

Post a Comment