Thursday, May 6, 2021

ఈ క్షణం జారనీకు.....

గతం నిన్ను బాధిస్తోందా నేస్తం ! వదిలెయ్ !
అందులోని తీపికై వెతుకు 
ఎండిన మోడులా ఎందుకలా నిలబడతావ్? 
ఎంత కాలం ఏడుస్తావు? 
దేహంమీది గాయాలు మానడం లేదా !
గుండె గాయాలు మాత్రం మానవా? 
సమయం కావాలంతే !
మరుపన్న వరం మనిషికి ఉందని మరిచావా? 
మారని గతం, చూడలేని భవితవ్యం 
రెండూ అప్రస్తుతం !
ఉన్నది వర్తమానం నీ అరచేతిలో !
ఈక్షణం మాత్రం జారనీకు 
దృష్టి సారించు 
మబ్బులు విడివడి 
తడబడే నీ అడుగులు 
సాగుతాయి మున్ముందుకు 
అదిగో, ఆశాకిరణం 
మిణుకు మిణుకుమంటూ, 
పిలుస్తోంది రారమ్మంటూ !!👋

*******************************
         🌺భువి భావనలు 🌺
*******************************

 

No comments:

Post a Comment