Thursday, April 25, 2024

బాలగేయం --- అమ్మ నాకు తినిపించే......

🙆🙂😊😇
   🌹🌺🌷🌹

అమ్మ నాకు తినిపించే
అల్లిబిల్లి కబుర్లతో
ఆకాశం చూపిస్తూ
అపరంజిని నేనంటూ         " అమ్మ "

ఇలకు దిగిన ఇలవేల్పునట !
ఈశ్వరవర ప్రసాదినట !
ఉన్నదంత నాదంటూ 
ఊర్వశివీ నీవంటూ !              " అమ్మ "

ఎన్నడూ లేదంట
ఏలోటూ నాకంట
ఐశ్వర్యం నాదంట !            " అమ్మ "

ఒరులెవరూ సాటిరారంట !
ఓనాటికి నేనవనికి
ఔతానట మహారాణిని !       " అమ్మ "

అందలాలు ఎక్కేనట
అః ! అహహ !
నేనే ఒక నియంతనట !!

🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺💐

4 comments:

  1. ముద్దుల పాప మురిపాలు LRSR

    ReplyDelete
  2. అమ్మకు పాప ఎప్పుడూ మురిపెమే కదా !

    ధరిత్రి 🌹

    ReplyDelete
  3. ఆ తరువాత “అమ్మ పెట్టే ఆ రెండూ పెడితేనే గానీ” బువ్వ తినదు 🙂.

    ReplyDelete