పైకి కనిపించే రూపం శాశ్వతం కాదు.అలాగే మనిషి అంద చందాలను బట్టి వ్యక్తిత్వాన్ని, గుణగణాల్ని అంచనా వేయడం తగదు. భాస్కర శతకం లోని ఈ పద్యంలోని భావం అక్షరాలా నిజం...
పూరిత సద్గుణంబు గల పుణ్యునకించుక రూపసంపదల్
దూరములైన వానియెడ దొడ్డగ జూతురు బుద్ధిమంతు లె
ట్లారయ గొగ్గులైన మరి అందుల మాధురి జూచిగాదె ఖ
ర్జూర ఫలంబులం బ్రియముజొప్పడ లోకులు గొంట భాస్కరా !
అందచందాలు లేకపోయినా సద్గుణాలు గల్గిన మంచి వ్యక్తిని బుద్ధిమంతులైనవారు మంచిగా చూస్తారు, గౌరవిస్తారు. అదెట్లాగంటే... ఖర్జూరఫలం నిండా ముడుతలు గలిగి చూడ్డానికి అందవికారంగా ఉన్నా...దానియొక్క తీపిదనాన్ని చూసి తినడానికందరూఎంతో ఇష్టపడతారు కదా...అని ఈ పద్య భావం.
నిజమే కదా ! ఎంతటి సుందరరూపులైనా ప్రవర్తన, మాటతీరు సరిగా లేకున్న ఎవరూ వారిని ఇష్టపడరు. గౌరవించరు. ఎంతో చక్కని భావాన్ని అందించే ఈ పద్యం నాకెంతగానో నచ్చిన పద్యం...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment