సాగాలీ సాగాలీ నిరంతరం...
చేరాలీ చేరాలీ మన గమ్యం...
నడుమ మనం మనం
ఆడుతు పాడుతు
జీవించాలి క్షణం క్షణం
సాగాలీ సాగాలీ నిరంతరం
చేరాలీ చేరాలీ మన గమ్యం //నవ్వుల//
మా బడియే మా ప్రియమైన మా ఇల్లు
మమతకు మారు రూపాలు
చదువులు చెప్పే గురువులు
శుభోదయం నేడే పట్టండీ కుసుమాలు
వేడుకమీర చెప్పండీ జేజేలు
ఆ గుడిలాంటి ఈ బడిలో
వెలసిన ఈ దేవుల నడుమ
కలిసి మెలిసీ కన్నులవిందుగ //నవ్వుల//
నిచ్చెనలోని మొదటి మెట్టు నువు ఎక్కకనే
చేరగలేవు ఆఖరిమెట్టు ఎన్నటికీ
ఆ మొదటి మెట్టు నీ ఉపాధ్యాయుడు మరవద్దూ
జీవనపథమున పైన నిలిచిన ఆ పొద్దూ
ఆ గుడి లాంటి ఈ బడిలో
వెలసిన ఈ దేవుల నడుమ
కలిసి మెలిసి కన్నులవిందుగ //నవ్వుల//
No comments:
Post a Comment