Thursday, August 11, 2022

అదిగో అదిగో... మువ్వన్నెల పతాకం...

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 

రారండోయ్ రారండోయ్ 
బాలల్లారా రారండోయ్
ఇదే ఇదే మన స్వతంత్ర భారతం
అదిగో అదిగో మువ్వన్నెల పతాకం
ఎగరేద్దాం ఎగరేద్దాం
వినువీధిని ఎగరేద్దాం
రారండోయ్ రారండోయ్ 
బాలల్లారా రారండోయ్

బాలలం మేం బాలలం 
భావి భారత పౌరులం 
దేశ భవితకు పునాదులం 
బాపూ  కలలకు ప్రతిరూపాలం 
ప్రగతిబాటకు ప్రతినిధులం 
జవానులం మేం జవానులం 
నవయుగ నిర్మాతలం 
అదిగో అదిగో మువ్వన్నెల పతాకం
ఎగరేద్దాం ఎగరేద్దాం 
వినువీధిని ఎగరేద్దాం
రారండోయ్ రారండోయ్
బాలల్లారా రారండోయ్

పని కోసం వచ్చారాపరాయివాళ్ళు !
బానిసలం మనమా మనమా? 
సొంతగూటిలో  పరాయిపాలన !
సహింతుమా సహింతుమా !
" తొలగిపొండి తెల్లోళ్లు" 
"క్విట్ ఇండియా" క్విట్ ఇండియా "
నాటి ప్రభంజనం....
నేటి మన స్వేచ్ఛాభారతం 
అదిగో అదిగో మువ్వన్నెల పతాకం
ఎగరేద్దాం ఎగరేద్దాం 
వినువీధిని ఎగరేద్దాం
రారండోయ్ రారండోయ్
బాలల్లారా రారండోయ్

స్ఫూర్తి  ప్రదాతలు నాటి నేతలు 
మార్గదర్శకులు నేటి నాయకులు 
అనుసరిద్దాం వారి అడుగుజాడలు
అంబరమే  సరిహద్దుగా
అందరం కలిసి నడుద్దాం
అదిగో అదిగో మువ్వన్నెల పతాకం
ఎగరేద్దాం ఎగరేద్దాం
వినువీధిని ఎగరేద్దాం
రారండోయ్ రారండోయ్
బాలల్లారా రారండోయ్
ఇదే ఇదే మన స్వతంత్ర భారతం
అదిగో అదిగో మువ్వన్నెల పతాకం
ఎగరేద్దాం ఎగరేద్దాం
వినువీధిని ఎగరేద్దాం
రారండోయ్ రారండోయ్
బాలల్లారా రారండోయ్

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐





No comments:

Post a Comment