🌷🐦
మండే ఎండలు
చల్లారుతున్న ఓ సాయంత్రం
చల్లగ వీచే చిరు గాలి
అలా అలా తేలివచ్చి
నా చెంతజేరి నను తాకి
సేదదీర్చుతున్న ఆ క్షణం !
ఇష్టం నాకెంతో ఇష్టం !! 🙂
చిటపట చినుకులు చిరుజల్లులై
ఎండిన నేల తడిసి
మెల్లగా, మెల్లమెల్లగా పైకెగసిన
ఆ కమ్మటి మట్టి వాసన !
ఇష్టం, ఇంకా ఇంకా ఇష్టం !
పదునెక్కిన భూమిని ఒదిగిన
నేనాటిన ఓ చిన్ని విత్తనం
అంకురమై దర్శనమిచ్చిన ఆ తరుణం !
రెప్ప వాల్చక వీక్షించే ఆ అపురూప దృశ్యం !
ఇష్టం, మరెంతో ఇష్టం !
తొలి పూతతో తనువంతా పులకింపజేసి
కాయగ మారి పరిపక్వమై పండై నిలిచి
నను అబ్బురపరచిన ఆ నిమిషం
ఆస్వాదిస్తూ పురివిప్పి నాట్యమాడెనే,
నా మానసం ! ' ఔరా' ! అనుభవిస్తేనే గాని
అవగతం గాని ఆ 'అద్భుతం' !!
తలచి తలచి పరవశించడం !
నాకెంతో ఇష్టం, మరీ మరీ ఇష్టం !! 😊 🐦
🌹🌹🌹🌹🌹🌹
"అవగతం గాని ఆ 'అద్భుతం' !!
ReplyDeleteతలచి తలచి పరవశించడం !
అది నాకు మరీ మరీ ఇష్టం !! "
అందుకే నా కిష్టంగా మార్చుకున్నాను.
Thanks for the comment sir.
ReplyDelete