🌷
~ యం. ధరిత్రీ దేవి ~
పసిపాప నవ్వు !
ఆ నవ్వులో ఎంత స్వచ్ఛత !
ఆ పసితనంలో ఎంతటి పవిత్రత !
అరవిరిసిన పుష్పంలా ఆ వదనం
పరవశించిపోదా హృదయం !
చూస్తే చాలు, చేతులు చాస్తూ.
కేరింతల స్వాగతాలు !
బోసినవ్వుల పలకరింపులు !
ఎత్తుకున్నవారికి మురిపాల వరహాలు !
ఈర్ష్యాద్వేషాలకు కడు దూరం ఆ పసిది
కపటమెరుగని దరహాసం తనది !!
అమ్మానాన్నల పుణ్యఫలం
వరమై ఒడిజేరిన క్షణం
అంబరమంటిన వారి ఆనందం
వర్ణనాతీతం...! అది...
అమూల్యం...అపురూపం !!
పసిపాప !! 🙂 నిజముగ....
దేవుడు కొలువైన దేవతాస్వరూపం
దేవతలు దీవించి
ఇలకు పంపిన మరో దైవం ! 🌹
🙂🙂🙂🙂🙂🙂🌷🌷🌷🙂🙂🙂🙂🙂🙂
No comments:
Post a Comment