🌺భువి భావనలు 🌺🐦
************
[ గురు పూజోత్సవం సందర్భంగా చిన్నారులకోబాలగేయం 🌷]
చదువుల బడిలో 'అ ఆ' లు
దేవుని గుడిలో బాజాలు
జీవన గతిలో జేజేలు!
అ ఆ లు, బాజాలు, జేజేలు
భవితకు అవియే బంగరు బాటలు
వెయ్ రా అడుగులు ముందుకు
వేరే వాదం ఎందుకు పదరా తోసుకు " చదువుల"
తూరుపు దిక్కున తెల్లారేను
పడమటి దిక్కున పొద్దారేను
అటు ఇటు తిరిగి చూసేలోగా
కాలం హరించి పోయేను
బుడగ వంటిదీ బ్రతుకు
చితికేలోగా మెరుపై మెరిసీ
కథగా నిలిచీ తరించి పోరా
వెయ్ రా అడుగులు ముందుకు
వేరే వాదం ఎందుకు పదరా తోసుకు " చదువుల"
ఆడే వయసున అక్షరమాలతో
పునాది వేసే పాఠశాలలు
మనిషిగ నిన్ను తీరిచిదిద్ది
నిలబెట్టే కళాశాలలు
తీర్చలేనిదా ఋణము
కరములు రెండూ జోడించి
నమస్కరించిన చాలునూ
వెయ్ రా అడుగులు ముందుకు
వేరే వాదం ఎందుకు పదరా తోసుకు " చదువుల"
బాలలు మీరు భావితరాలకు
దూతలుగా వెలుగొందాలీ
భాషకు అందని బాధలు ఎరుగని
మరో జగతియే జనియించాలీ
దీక్షా కంకణబద్ధులై
ధీశాలురు మీరందరూ
వెలుగూనీడల పోరాటంలో
అదరక ముందుకు సాగాలీ
వెయ్ రా అడుగులు ముందుకు
వేరే వాదం ఎందుకు పదరా తోసుకు " చదువుల"
😇😊😇😊😇😊😇😊😇😊😇😊😇😊😇
No comments:
Post a Comment