Thursday, April 30, 2020

మరణం ఎంత దారుణం !

'కరోనా ' ఉధృతి తగ్గడం కాదుగదా ఇంకా పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో....... 

మరణం ఎంత దారుణం !
----------------------------------
ఈ క్లిష్ట సమయాన
మరణం ఎంత దారుణం !
అయినవాళ్ల ఆఖరిచూపుకూ 
నోచుకోని దౌర్భాగ్యం 
కాటిదాకా నడిచే తోడు లేక
 ఆఖరి ప్రయాణం!
' ఆ నలుగురు' సైతం
 దొరకని వైనం' !
ఇది చాలదంటూ 
 ఆరడుగుల నేల కోసం
 వాదులాటలు వ్యతిరేకతలు!
 నశించిన మానవత్వం
 అదృశ్యమైన సంస్కారం
 పగవాడిక్కూడా వద్దీప్రారబ్ధం !
 వందలు వేలు లక్షలు
 ఇంకెంతకాలమీ అనాధ శవాల 
 తరలింపులు ? 
 భగవంతుడా  ! ఈ క్లిష్ట సమయాన 
 మరణం ఎంత దారుణం !

 ఇది ప్రకృతి ప్రకోపమా, శాపమా ? 
 భారం మోయలేని భూమాత 
 ఆక్రోశమా, ఆగ్రహమా ? 
 లేక విధి వైపరీత్యమా ? 
 అన్నీ కలిసి ' కరోనా ' మహమ్మారిగా
 మారిన విచిత్ర ఉదంతమా  ?
 గతి తప్పిన ఈ గుండె చప్పుడు
 గాడిన పడే ఘడియలెప్పుడు ? 

--------------------------------------------------------
మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 
********

4 comments:

  1. దిక్కు లేని దయనీయ శవాలను గూర్చి దయతలచిన ధరిత్రీ నీకు జోహార్లు.------LRSR.

    ReplyDelete
  2. ప్రస్తుతం ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధనిపించింది. స్పందించినందుకు సంతోషం.

    ReplyDelete
  3. Nijamandi. Taluchukuntene okarakamaina bhayam aavahistondi. Paristhitini kallaku kattinatlu choopinchaaru Mee kavita dvaaraa🙏

    ReplyDelete
  4. Thank you very much for your appreciation swethagaru.

    🌹🌺 Dharithri

    ReplyDelete