Tuesday, November 24, 2026

ఏ తోటలోన.. ఏ కొమ్మపైన.. విరబూసినావే..! (పాట)

          
 
❇️✴️✳️✴️❇️✳️✴️❇️✳️✴️❇️✳️✴️✳️❇️        
                యం. ధరిత్రీ దేవి 
 ✴️✳️✴️❇️✴️✳️❇️✴️✳️❇️✴️✳️❇️✴️❇️

 ఏ తోటలోన.. ఏ కొమ్మపైన.. విరబూసినావే..
 ఏ దోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు నడిచొచ్చినావే 
 మా ముంగిట నిలిచి.. మా కోసం విరిసీ 
 మా ఇంట వెలుగులే వెదజల్లినావే..
 బంతి పువ్వా.. ఓ బంతి పువ్వా     // ఏ తోట లోన //

 మా ఇంటి గడపకు పసుపునే అద్దినావు 
 మామిడాకు పచ్చదనం నీకు తోడు కాగా 
 గుదిగుచ్చిన మాలవై గుభాలిస్తూ నీవు 
 మా ఇంటి గుమ్మానికి తోరణం అయ్యావు 
 తోరణమే అయ్యావు..
 బంతి పువ్వా.. ఓ బంతి పువ్వా..     // ఏ తోటలోన//

 ముంగిట్లో ముత్యాల ముగ్గులు 
 ఆ నడుమ గొబ్బెమ్మల మెరుపులు 
 ఆపైన ఠీవిగా నీ సోయగాలు 
 వర్ణించ నా తరమా ఓ పుష్పరాజమా 
 ఓ పుష్పరాజమా..
 బంతి పువ్వా ఓ బంతి పువ్వా          //ఏ తోట లోన!//

 వాలుజడల వయ్యారి భామలు 
 ఆ సిగలో ఒదిగిన పూబంతులు 
 వేయి రేకులొక్కపరి విచ్చుకున్న రీతిగనీ 
 చందమామ చిన్నబోయి దాగింది చూడు మరీ 
 బంతి పువ్వా..ఓ బంతి పువ్వా...
 ముద్దరాలి ముద్దుమోము  నీ ముందది ఏ పాటి..!
 నిజం నిజం.. నిజం 'సుమా'..నీకు నీవే సాటి
 బంతి పువ్వా..ఓ బంతిపువ్వా         // ఏ తోటలోన//

✳️✴️❇️✳️✴️❇️✳️✴️❇️✳️✴️❇️✳️✴️


No comments:

Post a Comment