Saturday, August 30, 2025

అమ్మ భాష విశిష్టత...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం నేడు 
తెలుగును వాడుక భాషగా ప్రోత్సహించిన ఘనుడు
తెలుగుభాషా దినోత్సవ శుభ సందర్భం ఈనాడు
ఇది కేవలం వేడుక మాత్రమే కాదు 
భాషాభివృద్ధి..సంస్కృతీ పరిరక్షణల 
నిరంతర కృషికై స్ఫూర్తినిచ్చు శుభదినం...
అనాదిగా ఘనచరిత గలిగిన బాష మనది...
ఆదికవిగా తెలుగు భాషకు పునాది వేసిన నన్నయ... 
సంఘ సంస్కరణల భావాల వెల్లువతో
చిరస్మరణీయుడైన కందుకూరి..
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
అంటూ సామాజికస్పృహ రగిలించిన గురజాడ...
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా..అంటూ ఎలుగెత్తి చాటిన వేములపల్లి...
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. అంటూ
గేయాల వెల్లువ కురిపించిన ఆత్రేయ... 
దేశభాషలందు తెలుగు లెస్సయని
పలికిన కృష్ణదేవరాయల అభిమానధనం...
భాషావైభవాన్ని చాటి చెప్పిన బమ్మెర పోతన భాగవతం... అంతేనా... వేమన శతకం..
సుమతీ శతకం అందించిన నీతులు..సూక్తులు
నాడూ..నేడూ ఏనాడైనా..పరిమళం కోల్పోని 
సుగంధ భరిత నిత్య స్ఫూర్తి కిరణాలు...
మహామహులను స్మరించుకుంటున్న
ఈ మహత్తర క్షణాన..మాతృభాష విశిష్టత 
మననం చేసుకుందాం... అమ్మ భాష గొప్పదనాన్ని
నలుచెరగులా విస్తరింపజేద్దాం... 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
        తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹








 

No comments:

Post a Comment