🌹 బాలలంటే ఆయనకి ఇష్టం. బాలలకు ఆయనంటే ఇష్టం. అందుకే అయ్యాడు నెహ్రూ మామయ్య వారికి. ఆయన జన్మదినం బాలల దినోత్సవం. ఎర్ర గులాబీ ఎంత పుణ్యం చేసుకున్నదో ! ఆయన కోటుపై పొందింది స్థానం... గొప్పగా జీవించాడు. ప్రధానిగా వినుతికెక్కాడు. చెదరదు ఆ చిరునవ్వు... భరతమాత గన్న ముద్దు బిడ్డ నెహ్రూ. జవహర్ అంటే ఆభరణం. నిజంగా ఆయన ఓ ఆభరణమే.. నిజమే కదా ! బాలలందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు 🌷
పిల్లలూ.. నెహ్రూ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..
నవంబర్ 14 1889 న అలహాబాద్ లో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మోతిలాల్ నెహ్రూ. తల్లి కమలా నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధాని. 1964 వ సంవత్సరంలో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన నాయకుల్లో ఒకరిగా పేరుగాంచిన వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. లౌకిక, సామాజిక ప్రజాస్వామ్యవాది. తర్వాతి రోజుల్లో నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని భారత ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించారు,.

No comments:
Post a Comment