Wednesday, October 21, 2020

వర్ణశోభితం

 

నల్లనల్లని మూలాలు పుడమి కడుపున

దాగెనే చల్ల చల్లగా

 ఆపైని అలరించే కొమ్మలు రెమ్మలు

 చుట్టూ విస్తరించగా

 పచ్చపచ్చగా విచ్చిన పత్ర దళాల

 చీర చుట్టుకుని నడుమ

 నిలబడింది చూడు కాండం

 ఠీవిగా గోధుమ వర్ణాన !

 అంతేనా--

అటు చూడు చూడు🌺🌹

 ఎన్ని మొక్కలు 🙂

 ఎన్నెన్ని రంగులు !

 మరెన్నెన్ని ఆకృతులు !

 పసిడి కాంతులు వెదజల్లుతూ

 పరిమళాలు విరజిమ్ముతూ

 పలు వర్ణాల సమ్మిళితమై విరాజిల్లుతూ

 తల్లి కొంగు చాటు నుండి

 తొంగి చూస్తున్న బుజ్జి పాపల్లా 

 సుమబాలలవిగో 🌹🌷🌺😊🙂

 ఎంత వర్ణ శోభితం!

మరెంత అబ్బురం !

 రవంత విత్తనమే!

 కొండంత విషయం దాచుకున్నదే !

 తరచి తరచి చూసే

 కళ్ళుండాలే గానీ 

 జగతి నిండా నలుమూలలా

 అందమే అందం 🙋

 ఆహా! ప్రకృతి ఎంత రమణీయం !

 వెరసి ఈ సృష్టియే అద్భుతం!

 మహాద్భుతం !!🙏🙏

**********************************************

                   🌷భువి భావనలు 🌷

**********************************************


3 comments:

  1. LRSR:

    "అందమే ఆనందము. ఆనందమే జీవన మకరందం"

    "భలే భలే అందాలు సృష్ఠించావు. ఇలా మురిపించావు
    అదే ఆనందం. అదే అనుబంధం ప్రభూ మాకేల ఈయవు..." Really God is Great.

    భగవంతుడే ఆనంద స్వరూపుడు.

    ReplyDelete
  2. Well said 👌👌👌 చక్కటి పాటలు గుర్తొచ్చినందుకు సంతోషం

    ReplyDelete