కింది వాక్యాల్లో బంధుత్వాలు దాగి ఉన్నాయి. కని పెట్టండి.
1. ప్రతీఏడూ మా మల్లె చెట్టు విరగగాస్తుంది.
2.ఒరేయ్, అక్కడ నీకేమి పని?
3. నీవిచ్చిన అత్తరు నాకు నచ్చింది.
4. బాబా వద్ద ఆశీర్వాదం తీసుకో బాబూ.
5. నీవే కాదంటే నాకు మరి దిక్కెవరు నాన్నా !
6. ఈ జావ దినదినం రెండు సార్లు తాగాలి.
--------------------------------------------------------------------
1.మామ 2.అక్క 3.అత్త 4.బావ 5.మరిది 6.వదిన
--------------------------------------------------------------------
ఆసక్తి గలవారు ఇలాంటివి ప్రయత్నించగలరు.
--------------------------------------------------------------------
🌷🌷'భువి 'భావనలు 🌷🌷
--------------------------------------------------------------------
జవాబులు కూడా టపాలోనే ఇచ్చేస్తే ఎలాగండీ మేడమ్ ? 🙂🙂
ReplyDeleteఆసక్తి గలవారు ఇలాంటి వాక్యాలు మరికొన్ని రాయండని చెప్పడమే నా ఉద్దేశ్యం.( మీరన్నట్టు ఒక ఉదాహరణ ఇచ్చివుంటే సరిపోయేదేమో )
ReplyDeleteఇప్పటికైనా మించి పోయింది లేదు. ఒక్క జవాబును ఉదాహరణ కోసం వదిలేసి తతిమ్మా జవాబులు తొలగించి, మీ టపాను తిరగ పోస్ట్ చెయ్యవచ్చు.
ReplyDelete————————————
నాకు తోచినదొక వాక్యం 👇.
తగ్గుతా తగ్గుతా అనటమే గానీ బరువు తగ్గింది లేదు.
👌 జవాబు : తాత
ReplyDeleteధన్యవాదాలు సర్ 🙏
✅ 🙂🙂
Delete