Friday, October 2, 2020

మహాత్మ.......

 

   

  అహింసే పరమాయుధంగా సాగి అసాధారణ రీతిలో దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించి భరతమాత దాస్య శృంఖలాలను పగులగొట్టి భారతీయులందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే భాగ్యం కల్గించిన ఓ అతి సామాన్యుడు అసాధారణ రీతిలో జీవనయానం సాగించిన ఓ మహా పురుషుడు మోహన్్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ( an ordinary man in an extraordinary way ). జాతిపితగా పేరెన్నికగన్న మహాత్మ గాంధీ నిరాడంబరత్వానికి ఓ మచ్చుతునక ఈ చిన్న సంఘటన. 

  ఓ సారి గాంధీజీ ఓ పాఠశాలను దర్శించాడట. అప్పుడు ఓ తరగతిలోని ఓ పిల్లవాడు గాంధీజీ చొక్కా లేకుండా తిరగడం చూసి, " అయ్యో, గాంధీ తాత వేసుకోవడానికి చొక్కా కూడా లేనంత బీద వాడా... " అనుకుని, ఆయన్ను సమీపించి, " మా అమ్మచొక్కాలు బాగా కుడుతుంది. ఆమెను అడిగి ఓ చొక్కా మీకోసం తెస్తాను..... " అని అన్నాడట. గాంధీజీ నవ్వి, ఆ పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకుని, 

" నాకు కొన్ని కోట్ల మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్లకు కూడా చొక్కాలు లేవు. నీవు వాళ్లందరికీ కూడా చొక్కాలు తీసుకురా గలవా మీ అమ్మనడిగి.... " అన్నాడట. 

"  ... ఏమిటి, గాంధీ తాత కు అంత మంది అన్నదమ్ములా...... " అనుకుని అవాక్కై పోయాడట ఆ పిల్లవాడు!యావత్తు దేశప్రజలందర్నీ తన వాళ్ళుగా భావించి వాళ్లకు లేని సౌకర్యం తనకెందుకని చొక్కా త్యజించిన మహనీయుడాయన. ఆయన నిరాడంబరత్వాన్ని తెలిపే ఇలాంటి ఉదాహరణాలెన్నో ! 

   గాంధీజీ ఆశయాలు, పట్టుదల, దీక్ష పరాయి దేశాలను కూడా ఎంతో ఆకర్షించాయి. విదేశీయుడైనా రిచర్డ్ అటెన్ బరో గాంధీజీ జీవిత చరిత్రను సినిమాగా తీయడమే ఇందుకు గొప్ప నిదర్శనం. ఆ సినిమా తీయడానికి అటెన్ బరోకు దాదాపు 18 సంవత్సరాలు పట్టిందట ! ' గాంధీ ' అన్న పేరుతో నవంబర్, 30, 1982 లో విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకొంది. 

1. Best Director 

2.  Best Actor 

3. Best Picture 

4. Best original screen play 

5. Best Film editing 

6. Best Art Direction 

7. Best cinematography 

8. Best costume Design 

   గాంధీజీ 151 వ జయంతి సందర్భంగా ఆయన సూక్తుల్లో కొన్ని ----

* అహింసను మించిన ఆయుధం లేదు. 

* ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. 

* కంటికి కన్ను సిద్దాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. 

* ఓటు, సత్యాగ్రహం -- ఈ రెండూ ప్రజల చేతిలోని ఆయుధాలు. 

* పాముకాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కానీ తాగుడు వ్యసనమన్నది ఆత్మను చంపేస్తుంది.  

* మానవత్వం అనే పుస్తకం కంటే వేరే ఉత్తమ గ్రంథం ఏముంటుంది? 

ఇంకా ----

బసవరాజు అప్పారావు గారు గాంధీజీ ఆహార్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ సరళమైన పదాలతో ఎంత చక్కగా వ్యక్తీకరించారో చూడండి... 

'మాలపిల్ల ' సినిమా లో ఈ గీతాన్ని సూరిబాబు గారు హృద్యంగా ఆలపించారు. 

 కొల్లాయి గట్టితే నేమీ 

మా గాంధి కోమటై పుట్టితే నేమి 

వెన్నపూస మనసు, కన్నతల్లి ప్రేమ 

పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు 


నాల్గు పరకల పిలక 

నాట్యమాడే పిలక 

నాల్గు వేదాల నాణ్యమెరిగిన పిలక 


బోసినోర్విప్పితే 

ముత్యాల తొలకరే 

చిరునవ్వు నవ్వితే 

వరహాల వర్షమే 


చకచక నడిస్తేను 

జగతి కంపించేను 

పలుకు పలికితేను 

బ్రహ్మ వాక్కేను 

 ----- ఎన్నో సంవత్సరాల నాటి పాట. వింటుంటే ఇప్పటికీ జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. 

చివరగా -- ప్రఖ్యాత శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ గాంధీజీ గురించి ఇలా అన్నారు. 

" ఇలాంటి ఒక మనిషి సజీవంగా ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాల వారు నమ్మడం కష్టం. "

                          **********

  అక్టోబర్, 2, 1869 న జన్మించిన గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం జనవరి, 30, 1948 న వినాయక గాడ్సే తూటాలకు బలై నేలకొరిగాడు. చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహనీయుని శకం ఆవిధంగా ముగిసిపోయింది. 💐💐💐

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹       

              🌷🌷🌷' భువి ' భావనలు 🌷🌷

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

6 comments:

  1. గాంధీజీ లాంటి వారు యుగపురుషులు 🙏.
    రిఛర్డ్ ఆటెన్-బరో గారు తీసిన “గాంధీ” ఒక అద్భుతమైన చిత్రం. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున నేను విధిగా ఆ సినిమా చూస్తాను. ఏదో ఒక చానెల్ వెయ్యక పోతుందా అని నేను ఎదురు చూడను. నేనే యూట్యూబ్ లో పెట్టుకుని చూస్తాను.

    ReplyDelete
    Replies


    1. "Hindus should not have
      anger against Muslims, even if the latter wanted to destroy them. Even if the Muslims wanted to kill us, we should face death bravely". - from the collected works.

      His flawed ideology of ahimsa towards adharmic enemies and his weird celibacy experiments in his last years are also noted by critics

      https://www.esamskriti.com/e/National-Affairs/For-The-Followers-Of-Dharma/Did-Gandhi-colon-S-Ahimsa-Get-India-Freedom-1.aspx#.X3cvI8I1yS0.twitter


      Delete
    2. అయితే సత్యం, నిరాడంబరత పట్ల ఆయన నిబద్ధత ఎనలేనిది. ప్రజలందరినీ ఇక త్రాటిపైకి తేవడం లో ఆయన పాత్ర ఎనలేనిది.
      అంబేడ్కర్ బోస్ లు ఆయన తో విభేదించారు.

      కోమటై పుట్టితే నేమి అని వ్రాయడం ఎందుకు. ఆయన విశ్వ మానవుడు.

      భగవద్గీత అధర్మం పై యుద్ధం చేయాలనే సత్యం బోదిస్తుంది.

      Delete
    3. Your attitude is excellent sir👌
      గాంధీజీ లాంటి మరో వ్యక్తిని ఈ భూమ్మీద మళ్ళీ చూడలేం.అటెన్ బరో గారికి భారతీయులంతా రుణపడిఉండాలి,లండన్ లో పుట్టినా ఓ భారతీయుని జీవితచరిత్ర సినిమాగా మలిచినందుకు.🙏

      Delete
    4. LRSR:
      యావత్ భారత దేశానికి గాంధీజీ ఒకే ఆత్మ.
      నిజమైన ప్రతి భారతీయుని గుండెలో గాంధీజీ కనిపిస్తారు. కనపడని దేవుళ్ల కంటే కనిపించిన ఈ దేవుడు మన కోసమే అవతారమెత్తిన మహితాత్ముడు. యుగపురుషుడు. ఆయన మన జాతి పిత అయినందులకు మనకెంతో గర్వకారణము.

      మనమందరము అన్ని మతాలు ప్రక్కనపెట్టి మన మతాన్ని హిందూమతమని కాక గాంధీ సిద్ధాంతాలతో క్రొత్తగా "గాంధీ మతమని" మార్చుకొని ఆచరిస్తే మన దేశం ఎంతో పవిత్రంగా, ఎంతో ఔన్నత్యంతో వెలిగిపోతుంది

      Delete