Monday, October 12, 2020

ఆరోగ్యభాగ్యం

 🙂😊👌

హఠాత్తుగా దేవుడు నా ముందు నిలిచి 

ఏంకావాలో కోరుకొమ్మని అడిగితే 

క్షణమాలోచించక అడిగేస్తా 

జీవితకాలం ఏ రుగ్మతలూ 

నను దరిజేరని దివ్యమైన 

ఆరోగ్యభాగ్య మిమ్మని 🙂

అష్టైశ్వర్యాలు, అడుగడుగునా దాసదాసీలు 

అభిమానించే ఆత్మీయ బంధాలు

 ఊరు వాడా బంధుగణాలు 

ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో 

వెన్నంటి నీ నీడలా ఉన్నా 

మదినిండా ముదమన్నది కరువైన 

పైవన్నీ వ్యర్థం వ్యర్థం 😔

అనారోగ్య భూతం నిను 

కబళిస్తున్న వేళ అవేవీ 

 నిను కావలేవు సుమీ ! 

 నిండైన ఆరోగ్యం తోనే అది లభ్యం 👌

 ఆరోగ్యమే మహాభాగ్యం

 అదుంటే అన్నీ ఉన్నట్టే కదా నేస్తం  👌

***********************************************

కరోనా వైరస్ మానవ జీవితాల్లోకి ప్రవేశించాక అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది.

***********************************************

                   ' భువి ' భావనలు 

                    🌷🌷🌷🌷🌷🌷


5 comments:

  1. అవునండీ, జీవితాన్ని ఆస్వాదించాలంటే ఆరోగ్యం చాలా అవసరం.

    అలాగే మీకు తెలుసు కదా ఒక రాజు గారి కథలో చెప్పినట్లు .... ఏ లక్ష్మి లేకపోయినా ఇబ్బందులను అధిగమించడానికి ధైర్యలక్ష్మి తోడు కూడా ముఖ్యం. అలాగే మంచి ఆరోగ్యం కూడా.

    ReplyDelete
  2. చాలా కరెక్ట్ గా చెప్పారండీ. ఆరోగ్యం, ధైర్యం (ఆత్మవిశ్వాసం అని కూడా అనొచ్చేమో)-ఈ రెండూ ఉంటే జీవితం లో ఎదురయ్యే సమస్యల్ని చాలా వరకూ ఎదుర్కోవచ్చు. Thank you very much for your valuable comment sir 🙏

    ReplyDelete
  3. LRSR:

    కోరికలే చాలా వరకు శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణం. కోరికలే దుఃఖానికి మూలము అన్న బుద్ధుని బోధనలను ప్రతి క్షణం గుర్తించుకుంటే అనారోగ్యం దరి దాపులలో ఉండదు చెల్లీ!

    ReplyDelete
  4. నిజమే, కానీ మానవమాత్రులం కదా, సాధ్యమా?

    ReplyDelete
    Replies
    1. LRSR:

      సంకల్పబలము ఉండాలి (దృఢ సంకల్పము).
      సందేహాలుండకూడదు.

      Delete