బంధాలకు అతీతమైనది...
అన్ని బంధాల్లో శ్రేష్టమైనది..
ఏ రక్తసంబంధం లేనిదీ..సృష్టిలో తీయనిదీ...
అపురూపమైనదీ..స్నేహ బంధమే నోయి...
బీదా గొప్పా..ఆస్తీ..అంతస్తు చూడనిదీ
కుల మతాలకు కడు దూరం అనేది...
ప్రతిఫలం ఆశించని పవిత్ర భావనకు
ప్రతిరూపమైనది..! స్వార్థ చింతన ఎరుగని
స్వచ్ఛమైన ప్రేమనందించేదీ స్నేహమేనోయి !!
అమ్మకు చెప్పుకోలేనిది...నాన్నతో పంచుకోలేనిది...
తోబుట్టువులతో మనసు విప్పలేనిది..
కష్టం సుఖం..కబుర్లతో కాలక్షేపం...అది ఏదైనా..
అరమరికలు లేని స్నేహంతోనే కదా సాధ్యం...!
బాధలో భుజం తట్టి ధైర్యాన్నిచ్చేది...
కష్టకాలంలో చేయూత నిచ్చేది...
కలకాలం నిలిచేది..పేగుబంధం కన్నా
పదిలమైనది..! నిరాశలో ఊపిరి పోసి
దారి చూపించేది..కల్మషరహితమైన
స్నేహమంటే అదేనోయి..!
అది వెదజల్లే సుగంధ పరిమళం
అనిర్వచనీయమోయి...!
ఇలపై ఇంతకు మించిన బంధముండునా!?
అటువంటి చెలిమిని మించిన కలిమి ఉండునా!!