" అమ్మా, నీకనవసరం, నీకేమీ తెలీదు, ఊరుకుంటావా... "
విసురుగా అనేసి పక్కకు తిరిగిన వివేక్ చొక్కా ఒక్క ఉదుటున పట్టుకుని ఈడ్చి ముందుకు వంచి వీపుమీద దబదబా మోదింది యశోద. అనుకోని ఈ హఠాత్పరిణామానికి వికాస్, ఆ పక్కనే కూర్చుని అల్పాహారం తింటున్న ఆమె అత్త జానకమ్మ ఉలిక్కి పడ్డారు.
వికాస్ ఇంటర్ ఫస్టియర్, వివేక్ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ యశోద పిల్లలు. తింటున్న ప్లేటు తో సహా లేచి,
" అయ్యో అయ్యో! అదేమిటే, మగపిల్లవాణ్ణి పట్టుకుని అలా కొట్టేశావు? " అంటూ జానకమ్మ అరిచింది.
" నువ్వు ఊరుకోఅత్తా, వీళ్ళు ఇలా తయారవడానికి నువ్వే కారణం. నీకు తోడు మీ అబ్బాయి.... ఇద్దరూ కలిసి వీళ్ళని మంచి మర్యాద, పెద్దా చిన్న అన్నది తెలియకుండా తయారు చేశారు.... "
" ఏమిటీ, నేనా?.. "
" అవును, మొదట్నుంచీ మగ పిల్లలు మగ పిల్లలు అంటూ నెత్తికెక్కించుకున్నారు. ఆయనేమో ప్రతిదానికి' నీకేం తెలీదు ఊరుకో', ' నోరు మూసుకొని అవతలికి పో' అంటూ వీళ్ళ ఎదుటే నన్ను హీనంగా చేసి తీసి పారేయడం.... " అంటూనే వివేక్ వేపు తిరిగి, " ఏరా, వెధవా, నాకేమీ తెలియకుండానే నువ్వు ఇంతెత్తు ఎదిగావా?.... " అంటూ నిలదీసింది.
" అయ్యో, అయ్యో ! నిక్షేపం లాంటి మగ పిల్లల్ని పట్టుకుని వెధవా, గిధవా అంటూ ఏమిటే !... "
" ఏ, మగ పిల్లలైతే కొమ్ములొచ్చాయా, లేక పై నుండి ఊడి పడ్డారా?.. అసలు ఇంట్లో అటుంచి బయట వీళ్ళు చేస్తున్న నిర్వాకం ఏమిటో నీకు తెలుసా? మొన్నటికి వీధి చివర ఉండే లలితమ్మ, ఆవిడ పొరుగింటి ఆవిడ ఇంటి మీదకు వచ్చి ఏమన్నారో తెలుసా?... ఏంటండీ, యశోదమ్మ గారూ, మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకుంటారా లేక మమ్మల్నే పెట్టమంటారా?... అంటూ గొడవ! విషయం ఏంటంటే--- టెన్త్ చదువుతున్న వాళ్ళిద్దరి అమ్మాయిల్ని ఈ ఇద్దరు వెధవలు దారెంటా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ ఒకటే ఏడిపిస్తున్నారంట ! పోనీలే, పట్టించుకోకుంటే వాళ్లే నోరుమూసుకుని పోతారని ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారట. వాళ్ళు చెప్తుంటే సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాన్నేను..... "
' సరే సరే... ఏదో మగపిల్లలు.. సరదాకి..... "
" చాల్లే, ఊరుకో, ఇది తప్పని మందలించాల్సింది పోయి ఇలా వెనకేసుకొస్తున్నావు... అందుకే అంటున్నా నిన్ను కూడా... " ఊపిరి తీసుకోవడానికన్నట్లు ఆగింది యశోద.
" అమ్మా, అదేమీ లేదమ్మా వాళ్లే మమ్మల్ని చూసి ఏదేదో.... " ముందుకొస్తూ తల్లికేదో చెప్పబోయాడు వికాస్.
".. నోర్ముయ్, అడ్డగాడిదల్లారా, నీ మాటలు నేను నమ్మాలి, ఇంట్లో నన్నెంత గౌరవిస్తున్నారో చూడడం లేదా... "
"... అయ్యో అయ్యో, మళ్ళీ తిడుతున్నావేమిటే? "
" తిట్టడం కాదు, ఆడవాళ్లంటే గౌరవం లేని వీళ్ళని అడ్డంగా నరికేయాలి. "
బుగ్గలు నొక్కుకుంది జానకమ్మ. ఈ గొడవకు బయట రూమ్ లో షేవింగ్ చేసుకుంటున్న ఆమె భర్త కృష్ణ మోహన్ కదిలివచ్చాడు. " ఏమిటీ గొడవ?.... "
"చాలించండి, అంతా మీ చెవుల్లో పడింది, ఇక మళ్ళీ వివరించే ఓపికల్లేవిక్కడ... మీ సుపుత్రుల ఘనకార్యాలు చెప్తున్నా... "
ఏదో అనబోయాడతను. కానీ యశోద వెంటనే అందుకుంది.
" మీరెప్పుడూ ' నీకేం తెలీదు ', ' నోరుమూసుకో ', 'అవతలికి పో ' అంటూ వీళ్ళ ముందే నన్ను చీపురుపుల్లలా తీసిపారేస్తూ తల్లిగా నాకంటూ ఏ విలువా లేకుండా చేసేశారు. మీకు తోడు ఇదిగో ఈవిడగారి వత్తాసు ఒకటి. దాంతో ఇద్దరూ ఇంట్లోనే కాదు బయట కూడా జులాయిల్లాగా తయారయి ఇంటి మీదకి ఫిర్యాదులు తెచ్చి మధ్యలో నా మర్యాద మంట కలుపుతున్నారు. దీనికంతా అసలు కారణం మీరే అంటున్నాను.. "
" నేనా? "
" చూశావా రా, ఇద్దర్నీ ఎంత లేసి మాటలంటోందో !.."
" సర్లే, ఇన్నాళ్లు నోరు మూసుకుని ఉన్నాను. కానీ పిల్లలిలా చెడి పోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేను. "
ఆవిడ ఏదో అనబోయింది. కానీ యశోద లో ఎన్నేళ్ళుగానో గూడుకట్టుకున్న ఆవేదన పొంగిపొరలి, భర్తనూ, అత్తగార్నీ ఆ క్షణాల్లో మాట్లాడనీయకుండా చేసేసింది.
" ఈ ఇంటికి వచ్చిన నాటి నుండీ నేను పడ్డ నరకం మరిచిపోలేను. ఈ ఇద్దరూ ఇలా పెరిగితే రేపు వాళ్లకు పెళ్లాలై ఈ ఇంటికొచ్చే కోడళ్ళు పడే అవస్థ నేను చూడ దలుచుకోలేదు. ఓ కోడలిగా నేను పడ్డ కష్టం వాళ్లకు రానీయనుగాక రానీయను "
" అదేమిటే, వాళ్ళు మగవాళ్ళు... "
ఆవిడ కలగజేసుకుని మాట్లాడబోయింది.
" మళ్లీ అదే మాట! మగవాళ్ళు మగవాళ్ళు ! మగ పిల్లల్ని నెత్తికి ఎక్కించు కోవడం, మహారాజుల్లా చూడడం, ఆడపిల్లల్నయితే చిన్నప్పట్నుంచీ అన్ని పనులూ చేయాలనడం. ఎందుకంటే రేపు మరో ఇంటికెళ్ళి గొడ్డుచాకిరీ చెయ్యాలిగా మరి! ఇలాంటి మీ ఆచారాలు ఇక వద్దంటున్నా... రేయ్... "
కొడుకుల వైపు తిరిగి అంది
".... ఇకనుంచీ ఇంట్లోనే కాదు బయట కూడా పిచ్చి వాగుడు, పిచ్చి చేష్టలూ చేశారంటే పళ్ళు రాలగొడతా ను. రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి, జాగ్రత్త!.... "
గరిటే పట్టుకున్న చేయి ఆడిస్తూ హెచ్చరించి వంటింట్లోకి వెళ్ళిపోయింది యశోద. జానకమ్మ ఏదో అనబోయింది గానీ కోడలు చూసిన చూపుకు నోరు మూత పడిపోయింది.
ఇన్నాళ్లూ కోపం వస్తే ఏదో కాస్త మందలించి ఊరుకునే తల్లి ఈరోజిలా చేయిజేసుకుని తీవ్రంగా అరిచేసరికి, అంతా నిశ్చేష్టులై పోయి ఓ క్షణం అక్కడ నిశ్శబ్దం తాండవించింది. ఆమెలో ఓ కొత్త అమ్మను, కొత్త భార్యను, కోడల్నీ చూసిన వాళ్ళు అవాక్కై అలాగే భూమికి అతుక్కుపోయారు.
************
శభాష్ యశోదా ! " అత్తగారింట్లో నేను నరకం అనుభవించాను, నన్ను రాచిరంపాన పెట్టారు, నిన్ను మాత్రం సుఖపడనిస్తానా. నేను పడ్డ బాధలన్నీ నువ్వూ పడాల్సిందే " నంటూ ఇంట్లో అడుగు పెట్టిన కొత్త కోడలిపై అకారణ ద్వేషంతో, అర్థం పర్థం లేని ప్రతీకార వాంఛతో ఆమెని ముప్పుతిప్పలు పెట్టే అత్తగార్లున్న ఈ గొప్ప సమాజంలో ఎప్పుడో రాబోయే కోడళ్ల క్షేమం గురించీ, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడ్డం గురించీ ఇంతగా ఆలోచిస్తున్నావే.... నిజంగా నీకు హాట్స్ ఆఫ్ ! అందరు తల్లులూ కొడుకుల్ని ఇలాగే పెంచితే, ఆడపిల్లలకూ వాళ్ళ తల్లిదండ్రులకూ సుఖశాంతులకు లోటన్నదే ఉండదు గదా ! అందుకే -రేపటి అత్తా ! అందుకోవమ్మా, ఇదిగో నీకు శతకోటి వందనాలు !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కరక్ట్ గా చెప్పారండి. మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ తరం జనాలకు ఏమాత్రమూ భయం భక్తి మంచి మర్యాద లేకుండా పోయింది.
ReplyDeleteనమస్తే అండీ, అభిప్రాయం తెలియజేసినందుకు సంతోషం. మొక్కై వంగనిది మానై వంగునా అన్నది రఫ్ కాపీ లో రాసుకుని టైప్ చేసేప్పుడు మిస్ చేశాను. మీరు చక్కగా చెప్పారు. నిజంగా ఈ తరం 90శాతం పెద్దల్ని గౌరవించటం లేదు.ఆ పాయింట్ చెప్పాలనిపించింది. Thank you once again.
ReplyDeleteచాలా బావుందండీ.
Deleteఒక కల్పితమైన కథ తో కొందరి పాఠకుల మనస్సులు కుదిల్చి వారినుండి తీసివెయ్య దగ్గ వ్యాఖ్యలు వచ్చాయంటే మీరు చాలా సమర్థులైన రచయితలే.
ReplyDelete😀అద్భుతః
Delete// “బ్లాగ్ వాతావరణం ఇంత వింతగా ఉంటుందనుకోలేదు సుమా !” //
ReplyDeleteఅలా అని మీరు బ్లాగులోకం నుండి దూరంగా వెళ్ళిపోయే ఆలోచన ఏమీ చెయ్యకండి. ఇక్కడ కొనసాగుతూ మీరు వ్రాసే పోస్టులు మీరు వ్రాస్తూ ఉండండి. ఉపయోగ పడే వ్యాపకమే ఇది. 👍
Thank you
Deleteఆండాళ్ళు ఎవరంటే తెలియదా ?
ReplyDeleteమీరు కూడా శ్యామలీయం గారి బాపతన్నమాట !
https://youtu.be/rsd2toHwfZ8
ఇంతకీ మీ బ్లాగ్ కి రాను అని ఎందుకు కూసారో మీకయినా అర్ధం అయిందా ?
ReplyDelete
Deleteఎందుకండీ ?
ధరిత్రి గారు,
ReplyDelete"గారాబం వద్దు" అనే ఈ youtube విడియో వినండి ఆసక్తి ఉంటే. మీ పోస్టుకు కొంచెం దగ్గరగా ఉంది అనిపించి లింక్ ఇస్తున్నాను ⬇ .
"గారాబం వద్దు"
https://www.youtube.com/watch?feature=youtu.be&v=cC8fJycFvz8
ఇప్పుడే చూశాను సర్, వాస్తవాలు చెప్పారు. Thank you 🙏👃
ReplyDelete