చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగనేర్చునటయ్యభాస్కరా!
ఒక మనిషి ఎంత విద్వాసుడైనప్పటికీ అతడు నేర్చిన, చదివిన విద్యలోని సారాన్ని కొద్దిగానయినా గ్రహించకపోతే అటువంటి విద్య ఎందుకూ పనికిరాదు. అటువంటివారు ఎంతటి విద్యాసంపన్నులైననూ...పండితోత్తములు, బుద్ధిమంతులు వారిని మెచ్చుకోరు. నల మహారాజు వంటలు అమోఘమైన రుచితో చేయడంలో పేరుగాంచినవాడు. అటువంటి నలుని లాగా వంట చేసినప్పటికీ అందులో ఉప్పు అన్నది వేయకపోతే ఆకూరకు...ఆ వంటకానికి రుచి అన్నది ఉండదు..రానే రాదు. చేసే పని సక్రమంగా ఉండాలి. అప్పుడే దానికి పండితుల నుండీ, మేధావి వర్గం నుండీ తగిన గుర్తింపు అన్నది వస్తుంది. ఏనుగు లక్ష్మణ కవి రాసిన 'భాస్కర శతకం' లోని ఈ పద్యంలోని భావం గ్రహించడం చాలా ముఖ్యం...
No comments:
Post a Comment