Tuesday, November 18, 2025

నా ఆశావాదం నా ఊపిరి...

 
నా కలలు కల్లలై కూలిన నాడు 
కలవరపడను..మరో కలకు 
ఆహ్వానం పలుకుతాను...
నిరాశ నిస్పృహలు  ముంచెత్తిన క్షణాన 
నీరసించిపోను..నన్ను నేను నిందించుకోను.. 
తడబడక నిలబడి అడుగులు కదుపుతాను 
అవహేళనలు..అవమానాలు...
నా భావి కట్టడానికి పునాదులు.
ప్రతి అపజయం నా విజయానికి ఓ మెట్టు 
ఆ నిచ్చెన నాకో ఆసరా...
నిత్యం భుజం తడుతూ ఇచ్చే భరోసా...
నా దృఢసంకల్పం నాలో 
నవ చైతన్యానికి రహదారి...
ఒకనాటికదే నా చేతికందే 
సత్ఫలితానికి నాంది..అందుకే...
కలలు కల్లలైతే కలవరపడను...
మరో కలలో లీనమవుతాను...
నా ఆశావాదం నా ఊపిరి...
నా జీవనగమనానికి అదో తిరుగులేని 
ఇంధనం..అనుక్షణం..ఆగక నను
ముందుకు నడిపించే ఆయుధం...  

[ 'విహంగ' అక్టోబర్ 2025 మహిళా మాస పత్రికలో నా కవిత]




No comments:

Post a Comment