మల్లెకన్నా, మందారకన్నా,గులాబీకన్నా, లిల్లీకన్నా నేనేమి తక్కువ! రూపం లేదా! ఆకృతి లేదా! కనులకింపైన రంగు లేదా! 'సువాసన' అంటారా! అయితే నేమి? అదొక్కటే కదా లేనిది! అంత మాత్రాన అన్నింటికీ నన్ను దూరం చేస్తారా! అంటోందీ చిన్ని పువ్వు...!
మొగ్గగా ఉన్నప్పుడు ముడుచుకుపోయినట్లున్నా... పువ్వై విచ్చుకున్న పిదప ఎంచక్కా కొమ్మల మాటు నుండి ముందుకొచ్చి, ఆకాశంలో చందమామలా ఎర్రగా మెరిసిపోతూ, ఆకుపచ్చని ఆకుల నడుమ తల్లి చాటు బిడ్డలా గారాలుపోతూ దర్పంగా నిలబడ్డ ఈ చిన్నారి పుష్పం ముందు కాస్త అలిగినా, సర్దుకుని, " అందంగా లేనా... అస్సలేం బాలేనా.." అని పాడుతున్నట్లుగా లేదూ!!
సృష్టిలో రకరకాల పూల మొక్కలు... అవి అందించే లెక్కలేనన్ని అందమైన పుష్పాలు.. నిత్యం మనం ప్రకృతిలో చూస్తూ ఉంటాం. దేని అందం దానిదే.. దేని ప్రత్యేకత దానిదే. కళాత్మక హృదయం ఉంటే అన్నీ కన్నులవిందు చేసేవే...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment