🥀🥀 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
🌷🌷💐 HAPPY TEACHERS' DAY 💐🌷🌷
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ఎక్కువ శాతం పిల్లలు గానీయండి... పెద్దలు గానీయండి... మీ తొలి గురువు ఎవరంటే ఓ టీచర్ పేరు గానీ, మాస్టారు పేరుగానీ చెప్తుంటారు. కానీ నేను మాత్రం నా తొలి గురువు మా నాన్నగారే అని చెప్తాను. ఎందుకంటే, ప్రాథమిక పాఠశాల స్థాయిలో నాకు అక్షరాభ్యాసం చేసింది మానాన్నే...ఆతర్వాత, బడికి వెళ్లి అక్షరాలు దిద్దినా... తొలి గురువు స్థానం మాత్రం ఆయనదే ! అలాగని ఒకటవ తరగతి పంతులమ్మను మరిచిపోలేను. ఆమె రూపం, ఆహార్యం... లీలగా నాకు ఇప్పటికీ గుర్తే !
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా... ఈరోజు మా తండ్రిగారి గురించి నాలుగు మాటలు రాయాలనిపిస్తోంది. ఆరోజుల్లో, SSLC చదివిన వాళ్లకు కూడా ఇంగ్లీషు భాషపై మంచి పట్టు ఉండేది. మా నాన్న BA డిగ్రీ చదవడానికి కాలేజీలో చేరాడటగానీ.. పూర్తి చేయలేదట. అయినా ఆంగ్లం అనర్గళంగా మాట్లాడేవారు . చక్కని శైలిలో రాసేవారు . అందుకోసం 'హిందూ' డైలీ పేపర్ ఎక్కువగా చదివేవారట! చదవడంవల్ల, మాట్లాడటంవల్ల భాష బాగా అభివృద్ధి చెందుతుందని నాతో ఎప్పుడూ చెప్పేవారు.
నా విద్యాభ్యాసకాలమంతా నా వేలు పట్టి నడిపించారాయన. నా చదువు పూర్తయ్యేదాకా నా ప్రతి అడుగులోనూ ఆయన మార్గదర్శకత్వం ఇమిడి ఉంది. చిన్నతనంలో తెలియక నా మొండితనంతో ఆయన్ని విసిగించిన సందర్భాలున్నాయి. కానీ ఏక్షణమూ నా పైన కోపం అన్నది చూపింది లేదు. అంతటి సహనం ఆయన సొంతం. నా వివాహానంతరం కూడా నేను అదనపు విద్యార్హతలు పొందడంలో ఆయన ప్రోత్సాహం ఎంతైనా ఉంది.
మా నాన్న పరమపదించి ఇప్పటికి ఇరవైఒక్క సంవత్సరాలు దాటింది. అయినా... వారితో పెనవేసుకున్న జ్ఞాపకాలు సజీవంగా నాలో గూడు కట్టుకొనే ఉన్నాయి...ఓ తండ్రిగా, గురువుగా మార్గదర్శిగా, ప్రేమమూర్తిగా...! అవి ఎప్పటికీ చెదిరిపోవు...చెరిగిపోవు...నేనున్నంత వరకూ... 🙏
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
No comments:
Post a Comment