👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩
ఆడపిల్లంటే ఆదిశక్తి అంటూ 
మహాలక్ష్మి స్వరూపమంటూ 
సిరి నట్టింట వెలిసిందంటూ 
మహదానందపడే రోజులా ఇవి  !!
అదెప్పుడూ 'ఆడ' పిల్లేనంటూ 
శని నెత్తిన దాపురించిందంటూ 
తెగటార్చడానికి సిద్ధపడే తండ్రులు 
తయారైన కసాయి రాజ్యం ప్రస్తుత మిది !
వావివరుసలు వయోభేదాలు మరిచి
కన్నుమిన్ను గానక చెడిన 
కామాంధులకాలవాలమై పోయి 
మైలపడ్డ మృత్యు కుహరమిది !
మానవమృగాలంటే మృగాలు సైతం 
సిగ్గుతో చితికిపోయే దుస్థితికి 
దిగజార్చిన అమానవీయ దుశ్చర్యల 
పరంపర కడకేతీరం చేరి కడతేరుతుందో మరి !!
👩👩😔😔👩👩😔😔👩👩😔😔👩👩😔😔
మృగాలతో పోలిస్తే మృగాలను . అవమానించినట్లే.
ReplyDeleteఅంతే కదండీ...
Delete