🫠
~ యం. ధరిత్రీ దేవి
అర్ధాంతరంగా పోవాలనీ లేదు !
కాసులు కోట్లాది కూడబెట్టాలని లేదు...
కన్నబిడ్డలకు కాసింత కట్టబెట్టాలనుంది !
ఇంద్రభవనమైతే వద్దు...ఇల్లన్నదొకటి చాలు..
అదృష్టవంతుల్ని చూసి అసూయపడను...
నాకూ కాస్త అంటించమంటాను ఆ దైవాన్ని !
సమస్యలు...సవాళ్లు వద్దనుకోను...
ఆ సుడిగుండం దాటే స్థైర్యం కోరుకుంటాను...
ఆశలున్నాయి నాకు...అత్యాశలైతే లేవు..
అవధులు దాటే ఆశయాలు...నా చెంతకు చేరలేవు...
నా శక్తిసామర్థ్యాలు వాటికెరుకే గనుక !!🙂
ఆదర్శాలు వల్లించలేను...
ఆచరించే దమ్ము లేదు మరి..!!
అనునిత్యం.. 'అందరం' బాగుండాలనుకుంటాను...
అందులో ఖచ్చితంగా నేనూ ఉంటాను గనక !! 😊
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
No comments:
Post a Comment