🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
😔
చెత్త కుప్పలో విసిరేయబడ్డ చిన్నిపాప
చెదలు పట్టిన విషసంస్కృతికి ప్రతీక
వెర్రి తలలు వేస్తున్న పురుషాధిక్య భావన !
ఏ దేవుడాలకిస్తాడీ పసికందుల ఆక్రందన !!
పొత్తిళ్ల నుండి ప్రాయం దాక ప్రాణప్రదమై
పదిలంగానున్న అపరంజి బొమ్మ...
పెళ్లి పీటలెక్కి పెద్దరికం వచ్చి
చిరునవ్వు మరిచి చింతలపాలైపోతోందమ్మ !
అత్తిల్లు కాదది... ఆరళ్లకు పుట్టిల్లు...
రక్షకుడు కాదామగడు... భక్షకుడు !!
ఆడబ్రతుకెప్పుడూ అరిటాకే... మగువా...
మారని ఈ నానుడి ఎన్నడూ మరువబోకు !
ఈ చేదు నిజం జీర్ణించుకున్నదేమో నీ తల్లి...
చిట్టితల్లీ ! నిను కడుపులోనే కాలరాసి...
'హంతకి' అనిపించుకుంటేనేమి గాక... !
నూరేళ్ల బ్రతుకు భారం నీకు దించేసింది సుమీ !!
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
No comments:
Post a Comment