Friday, September 4, 2020

నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం.....

నేడు ఉపాధ్యాయ దినోత్సవం. గురువులందరికీ శుభాకాంక్షలు.  నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న రోజుల్లో వ్రాసుకున్న బాల గేయమిది. 5, 6, 7 తరగతుల విద్యార్థులకు నేర్పిస్తే ఎంతో చక్కగా పాడేవారు. ఉపాధ్యాయుల ప్రాధాన్యత తెలియజెప్పే ఈ పాట ఈ శుభ సందర్భంగా నలుగురితో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ రోజు నా బ్లాగ్ లో పెడుతున్నాను. 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం
 ఆడుతు పాడుతు జీవించాలి క్షణం క్షణం
 సాగాలీ సాగాలీ నిరంతరం
చేరాలీ చేరాలీ మన గమ్యం          "నవ్వుల "

 మా బడియే మా ప్రియమైన మా ఇల్లు
 మమతకు మారు రూపాలు
 చదువులు చెప్పే గురువులు
 శుభోదయం నేడే పట్టండీ కుసుమాలూ 
 వేడుక మీర చెప్పండీ జేజేలు 
 ఆ గుడి లాంటి ఈ బడిలో
 వెలసిన ఈ దేవుల నడుమ
 కలసి మెలసీ కన్నుల విందుగ         " నవ్వుల "

నిచ్చెన లోని మొదటి మెట్టు
 నువ్వు ఎక్కకనే  చేరగలేవు 
 ఆఖరి మెట్టు ఎన్నటికీ
 ఆ మొదటి మెట్టు 
 నీ ఉపాధ్యాయుడూ మరవద్దూ 
 జీవనపథమున పైన నిలిచిన ఆ పొద్దూ 
ఆ గుడిలాంటి ఈ బడిలో 
వెలసిన ఈ దేవుల నడుమ 
కలసి మెలిసీ కన్నులవిందుగ         "నవ్వుల "

 నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం 
 ఆడుతు పాడుతు జీవించాలి క్షణం క్షణం
 సాగాలి సాగాలీ నిరంతరం
 చేరాలీ చేరాలీ మన గమ్యం     

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

              🌺🌺🌺'భువి ' భావనలు 🌺🌺🌺

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

7 comments:

  1. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నమస్సులు 🙏.

    ఉపాధ్యాయ దినోత్సవం

    ReplyDelete
  2. మీకు మన:పూర్వక ధన్యవాదాలు సర్ 🙏👃

    ReplyDelete
  3. Ma’am I like nuvvu nechanna lone modhate mettu .super one should not forget his/her first teacher mother and then school teacher. I love 💓 you

    ReplyDelete
  4. Ma’am I like nuvvu nechanna lone modhate mettu .super one should not forget his/her first teacher mother and then school teacher. I love 💓 you

    ReplyDelete
  5. Happy to see your comments in my blog, sarala 🌷
    నిచ్చెన లోని మొదటి మెట్టు ఉపాధ్యాయుడు --నిజమే కదా!Idid'nt get any awards during my professional life. But I have full satisfaction at my students'favour.
    ఈ టీచర్ పాఠాలు బాగా చెప్తుంది అని విద్యార్థులు అన్నారంటే -- అంతకు మించిన అవార్డు ఆమెకు/అతనికి మరెక్కడైనా లభిస్తుందా?
    ILOVE YOU TOO 🌹

    ReplyDelete
  6. L R S R:

    మమతల మధురిమలు పొంగిన ఎంతో చక్కనైన గీతం

    ReplyDelete