🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎగుడు దిగుడు దారుల్లో
ఎదనిండా బాధల బరువు మోస్తూ...
అడపాదడపా అంతో ఇంతో
మధురిమల నాస్వాదిస్తూ...
జీవనగమనం సాగుతూ సాగుతూ..
ఓ వత్సరకాలాన్ని వెనక్కి నెట్టి ..
మరో వత్సరంలోకి ప్రవేశిస్తూన్న
తరుణాన..మనకెందులకీ ఎగసిపడే
సంతోష తరంగాల వెల్లువ..!!.
ఒక్క రోజు దాటితే సద్దుమణిగి మరల
చీకూచింతలూ..పలకరించే
సమస్యల సవాళ్లు..మామూలేగా!
అయినా..అన్నీ కట్టిపెట్టి..
ఆవలకు నెట్టి..ఆనంద డోలికల్లో
ఊగుతూ ఆహ్వానం పలుకుతున్న
ఓ మనిషీ..! నీకు జోహార్లు..
బాధలన్నీ మరిచిపోయి...
బరువంతా దించేసుకుని...
తీపిని నెమరేసుకుంటూ..
కలిమిలేములు..కష్టసుఖాలు..
కావడికుండలన్న నిజాన్ని చాటుతూ...
రేపటిపై ఆశలు పెంచుకుంటూ...
ఒక్కరోజు..ఈ ఒక్కరోజు గడుపుదాం
అందరితో కలిసి..చేతులు కలిపి..
అంటూ..స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూ..
నూతనోత్సాహం నింపుతూ
వడివడిగా సాగే నీకు నీరాజనాలు..
నీవందించే సందేశంతో..సంతోషంగా..
మనసారా..అడుగిడుతున్న
ఆంగ్ల సంవత్సరానికి
చెబుదాం శుభాకాంక్షలు... 💐
💐🌹Happy New Year 2026💐🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment