కొమ్మచాటున !!
కుహూ...కుహూ అంటూ...
ఇదిగో..మామిడి కొమ్మ !
కాయల భారంతో వంగిపోతూ ...
అల్లదిగో..వేపపూత!
పచ్చపచ్చగా..పసిమితో
అందర్నీ పిలుస్తూ..!!అన్నీ కలిసి
'క్రోధి' కి వీడ్కోలు చెబుతూ...
'విశ్వావసు'ను స్వాగతిస్తున్నాయి...
గుమ్మాలకు మామిడి తోరణాలు...
గుభాలించే మల్లెల సౌరభాలు..!
ఘుమఘుమలాడే వంటకాలు...
అన్నింటి నడుమ...
వేసవి వడగాడ్పులు
పరుగులే పరుగులు !!
కష్ట సుఖాల కలబోతే కదా జీవితం...
కలిమిలేములతో సహజీవనం
అనివార్యం..షడ్రుచుల సమ్మేళనం
ఉగాది పచ్చడి రుచి చూద్దాం..
ఆస్వాదిస్తూ ఈ నిజం...
తెలుసుకుందాం..తెలియజేద్దాం...
స్వీకరిద్దాం..శుభసందేశం...
'విశ్వావసు'సంవత్సరాదిని
మనసారా స్వాగతిద్దాం...
~యం. ధరిత్రీ దేవి
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment